Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరోటి... గవాస్కర్ రికార్డును సమం చేసిన విరాట్!

  • ఈడెన్‌లో సెంచరీ బాదిన కోహ్లీ
  • కెప్టెన్‌గా 11 టెస్ట్ సెంచరీల రికార్డు
  • ఓవరాల్‌గా 50 సెంచరీలు
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయ సెంచరీ చేసిన కోహ్లీ టెస్టుల్లో 18వ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 50వ శతకం. ఈ సెంచరీతో కోహ్లీ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు.

గవాస్కర్ కెప్టెన్‌గా 11 సెంచరీలు సాధించగా, కోహ్లీ కూడా 11 సెంచరీలతో ఆయన సరసన నిలిచాడు. 2014లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ సారథిగా అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాళ్లలో గవాస్కర్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాతి స్థానాల్లో 9 సెంచరీలతో అజారుద్దీన్, 7 సెంచరీలతో సచిన్, 5 సెంచరీలతో ధోనీ, గంగూలీ,  పటౌడీ, నాలుగు సెంచరీలతో రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు.
Virat Kohli
Team India
Cricket

More Telugu News