nara rohith: ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు: నారా రోహిత్

  • సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాను 
  • 21 కిలోల బరువు తగ్గాను 
  • విలన్ గా అజయ్ మెప్పిస్తాడు   
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'బాలకృష్ణుడు' ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమా ఉంటుందనీ, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ తరహా సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను .. ఈ సినిమాతో ఆ ముచ్చట తీరిందని అన్నాడు. ఈ సినిమాలో నా పాత్ర పేరు 'బాలు' .. డబ్బు కోసం ఏమైనా చేసే పాత్ర ఇది. ఈ సినిమా కోసం  21 కిలోల బరువు తగ్గాను. పూర్తిస్థాయిలో కాదు గానీ .. సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాను. రెజీనా కథానాయికగా అలరిస్తుంది.. అజయ్ విలన్ గా కనిపిస్తాడని అన్నాడు. కథాకథనాలను నడిపించడంలోను .. పాత్రలను తీర్చిదిద్దడంలోను దర్శకుడు పవన్ మల్లెల తనదైన ప్రత్యేకత చూపించాడని చెప్పుకొచ్చాడు.     
nara rohith
regina

More Telugu News