jagapati babu: థియేటర్లు కొంతమంది చేతుల్లోనే ఉండటం సరికాదు: జగపతిబాబు

  • విజయవాడ వన్‌టౌన్‌ వీధుల్లో ఛారిటి వాక్‌
  • పాల్గొని మీడియాతో మాట్లాడిన జ‌గ‌ప‌తి బాబు
  • చిన్న సినిమాలను కాపాడుకోవాల్సిన‌ అవసరం ఉంది
  • క‌ళాకారులు ఇబ్బందులు ప‌డుతున్నారు
థియేటర్లు కొంతమంది చేతుల్లోనే ఉండటం స‌రైంది కాద‌ని సినీనటుడు జ‌గ‌ప‌తి బాబు అన్నారు. దీనివ‌ల్ల చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. తాను సినీ రంగంలోకి ప్ర‌వేశించి ముప్పై ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ రోజు విజయవాడ వన్‌టౌన్‌ వీధుల్లో ఛారిటి వాక్‌ నిర్వహించిన జ‌గ‌ప‌తి బాబు.. మీడియాతో మాట్లాడారు. చిన్న సినిమాలను కాపాడుకోవాల్సిన‌ అవసరం ఉందని ఆయ‌న చెప్పారు. థియేట‌ర్లు కొంద‌రి చేతుల్లోనే ఉంటే ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌ప‌తి బాబును ప్ర‌శ్నించ‌గా ఆయ‌న స్పందించ‌లేదు.    
jagapati babu
theatres
Vijayawada

More Telugu News