త్వరలో తగ్గనున్న గృహోపకరణాల ధరలు?
- యోచిస్తోన్న కేంద్ర ప్రభుత్వం
- జీఎస్టీ తగ్గింపుతో అందుబాటులోకి రానున్న ధరలు
- ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న గృహోపకరణాలు
ఏసీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్ల మీద పన్ను ఎక్కువగా ఉండటంతో విక్రయాలు తగ్గిపోయాయని తయారీ సంస్థలు ఫిర్యాదు చేసిన కారణంగా వీటిపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలి సంస్కరణల్లో భాగంగా 28 శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. షాంపూలు, వాషింగ్ పౌడర్ డిటర్జెంట్, ఫేషియల్ మేకప్, చాక్లెట్లు, వెట్ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతివాచీలు తదితర వాటిపై జీఎస్టీని 18 శాతం చేయడంతో 28 శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే మిగిలాయి.