వైసీపీ: వైసీపీ నాయకుడి వేధింపులతో.. ఆ పార్టీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం!

  • ముమ్మిడివరం వార్డు కౌన్సిలర్ బాలమునికుమారికి వేధింపులు 
  • అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలుగా ఇటీవలే ఎంపిక
  • ఆమెకు వ్యతిరేకంగా కొమానపల్లి వైసీపీ నాయకుడు పోస్ట్ 
  • పోలీసులకు ఫిర్యాదు..కేసు నమోదు

వైసీపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్ కాశి బాలమునికుమారికి అమలాపురం పార్లమెంటరీ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి ఇటీవలే దక్కింది. ఆమెకు ఈ పదవి లభించడంపై కొమానపల్లి వైసీపీ నాయకుడు కాశి రామకృష్ణ ఆమెకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ లు పెట్టాడు.

దీంతో, తీవ్ర మనస్తాపం చెందిన బాలమునికుమారి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముమ్మిడివరంలోని తన పుట్టింట్లో ఉన్న ఆమె ఈ ఘాతుకానికి పాల్పడటంతో, వెంటనే, బాలమునికుమారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, బాధితురాలు బాలమునికుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News