'పద్మావతి' సినిమాలో దావూద్ ఇబ్రహీం పెట్టుబడులు?
- సినిమాలో దావూద్ పెట్టుబడులు ఉన్నాయంటూ రాజ్ పుత్ ల ఆరోపణ
- దుబాయ్ నుంచి డబ్బులు వస్తే.. ఇక్కడ సినిమా తీశారు
- కరాచీ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న లోకేంద్ర సింగ్
ఈ నేపథ్యంలో, రాజ్ పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'పద్మావతి' సినిమాలో దావూద్ ఇబ్రహీం కూడా పెట్టుబడులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు. ఢిల్లీలో నిన్న రాత్రి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ నుంచి దావూద్ డబ్బులు పంపిస్తే... ఇక్కడ భన్సాలీ సినిమా తీశారంటూ ఆయన మండిపడ్డారు. కరాచీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని అన్నారు.