rakul: నెల రోజులు సెలవులు తీసుకుంటాను .. మనసుకు నచ్చిన కథలనే చేస్తాను: రకుల్

షార్ట్స్‌లో చూడండి
చిన్న సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన రకుల్, కథానాయికగా అగ్రస్థానానికి దూసుకుపోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు అభిమానుల సంఖ్యను పెంచేసుకుంది. అలాంటి రకుల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నాలుగేళ్లుగా రాత్రి .. పగలు పనిచేస్తూ వస్తున్నాను. వరుస సినిమాలు చేస్తూ అలసిపోయాను. అందువలన ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను" అంది.

 "వర్క్ పరంగా నేను అలసిపోవడం గమనించి .. విశ్రాంతి తీసుకోవలసిందేనని మా పేరెంట్స్ పట్టుబట్టారు. అందుకు నేను కూడా  సరేనన్నాను. సినిమాల సంఖ్యకి కాకుండా కథల పరంగా .. క్వాలిటీ పరంగా ప్రాధాన్యతను ఇవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలకు సైన్ చేశాను .. అవి సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది" అని చెప్పుకొచ్చింది.  
Go Back to Shorts
rakul

More Telugu News