rain: ఇరు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • తూర్పు నుంచి వీస్తున్న గాలులు
  • 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీనికి తోడు తూర్పు గాలులు వీస్తున్నాయని చెప్పారు. వీటి ప్రభావంతో ఇప్పటికే కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మరోవైపు మేఘాలు ఆవరించడం, తూర్పు గాలులతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మత్స్యకారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
rain
rain forecast for ap ts

More Telugu News