హీరోయిన్ మెహ్రీన్ వెళ్లిపోయిందా? అనుకున్నాను... మంచిది!: సాయి ధరమ్ తేజ్
- హైదరాబాద్ లో 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- హీరో మాట్లాడకముందే వెళ్లిపోయిన హీరోయిన్
- సరదా వ్యాఖ్యలు చేసిన సాయి ధరమ్ తేజ్
ఆమె సినిమాలో బాగా నటించిందని చెప్పాడు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు తనకు అభుభవం చాలకుంటే, విలన్ గా నటించిన ప్రసన్న చాలా సాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. సాయి మాట్లాడుతున్నప్పుడు అభిమానులు 'పవన్ పవన్' అని నినాదాలు చేస్తుంటే, "అవును... డెఫినెట్లీ మా ఇంటికి ఆయనే జవాను. నాకు ధైర్యంగా ఉండటం నేర్పించి, నన్నో జవానుగా తయారు చేశారు. ఆ జవాన్ కు సెల్యూట్" అన్నాడు.