shifali ranganathan: అమెరికాలో డిప్యూటీ మేయర్ గా చెన్నై మహిళ

  • చెన్నై మహిళకు యూఎస్ లో గౌరవం
  • సియాటెల్ డిప్యూటీ మేయర్ గా నియామకం
  • 2001లో యూఎస్ వెళ్లిన షిఫాలి
చెన్నై మహిళకు యూఎస్ లో అరుదైన గౌరవం లభించింది. సియాటెల్ డిప్యూటీ మేయర్‌ గా చెన్నైకు చెందిన షిఫాలి రంగనాథన్‌ (38) ఎంపికయ్యారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్న షిఫాలిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కస్, ఆమెకు ఈ పదవిని ఇచ్చారు.

షెపాలి తండ్రి రంగనాథన్‌. తల్లి షెరిల్‌ ఇప్పటికీ 2001 వరకూ చెన్నైలో ఉండి, ఆపై అమెరికాకు వెళ్లారు. చెన్నై నుంగంబాక్కంలోని గుడ్‌ షెప్పర్డ్‌ కాన్వెంట్‌, స్టెల్లా మేరీస్‌ కళాశాలల్లో చదివిన షిఫాలీ, బీఎస్సీలో జువాలజీ పట్టా పొందారు. అన్నావర్సిటీలో ఎన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌ లో విభాగంలో బంగారు పతకాన్ని కూడా పొందారు. 2001లో తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేసిన షిఫాలి రంగనాథన్‌ కు బోట్ రైడింగ్ లోనూ అనుభవం ఉంది.
shifali ranganathan
siyatel
deputy mayor

More Telugu News