Pawan Kalyan: ‘మై ఎవ్రీ డే హీరో’ అతడే.. అంటూ లండన్ నుంచి ఫొటో షేర్ చేసిన పవన్ కల్యాణ్!

  • ఎవ్రీడే హీరో అంటూ హకీంతో కలిసున్న ఫొటోను షేర్ చేసిన పవన్
  • విలువైన సలహాలు ఇచ్చారన్న జనసేన అధినేత
  • వాటిని పాటిస్తానని హామీ
అవార్డు అందుకునేందుకు లండన్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవార్డు తీసుకున్న అనంతరం అక్కడి అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ఎవ్రీ డే హీరో’ అంటూ హకీం అనే బంగ్లాదేశీ గురించి పరిచయం చేశారు. ఆయన తనకు పలు విలువైన సూచనలు ఇచ్చాడని పవన్ వివరించారు.

 తానెప్పుడు లండన్ వెళ్లినా హకీం తనను కారులో లండన్ మొత్తం తిప్పి చూపిస్తాడని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశీ అయిన హకీం లండన్‌లో ఎప్పుడో స్థిరపడ్డారని తెలిపారు. ఆయన తనతో ఎప్పుడూ ఏ విషయాలు మాట్లాడలేదని, కానీ తొలిసారి ఓ విషయం చెప్పాడని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణం కోసం ఇచ్చిన విలువైన సలహా అది అని కొనియాడారు. మహిళల రక్షణ, గృహ హింస, సీనియర్ సిటిజన్ల కోసం జాగ్రత్తలు వంటి వాటిపై హకీం ఇచ్చిన సలహాలు చాలా విలువైనవని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని పవన్ పేర్కొన్నారు. ఆ సలహాలను తాను పాటిస్తానని హకీంకు మాటిచ్చానని పవన్ తెలిపారు.

గాంధీ గురించి హకీం చెప్పిన ఓ విషయం తనను కదిలించిందని పవన్ పేర్కొన్నారు. తాను ముస్లిం కావడంతో ఇటీవల ఆయన మక్కా మసీదును దర్శించినట్టు పవన్ తెలిపారు. ఏ మతమైనా హింసను ప్రోత్సహించదని ఆయన చెప్పారని పవన్ వివరించారు. నిజాలు చెప్పే వ్యక్తులు తనకు గురుతుల్యులని పవన్ వివరించారు.
Pawan Kalyan
London
Hakim

More Telugu News