ధావన్: ముగిసిన తొలి టెస్టు నాల్గో రోజు ఆట... భారత్ స్కోర్: 171/1

  • శంక బౌలింగ్ లో డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చిన ధావన్
  • శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 294/10
  • భారత్ తొలి ఇన్నింగ్స్ : 172/10 

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సెకండ్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. దీంతో,  శ్రీలంకపై భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో వున్న కేఎల్ రాహుల్ 73 పరుగులతో, పుజారా 2 పరుగులతో ఉన్నారు. 

కాగా, తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. శంక బౌలింగ్ లో డిక్ వెల్లాకు ధావన్ క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. మొత్తం 116 బంతులు ఆడిన ధావన్ 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 294/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 172/10 

  • Loading...

More Telugu News