bandla ganesh: హీరోలను పొగడటంలో తప్పులేదు: బండ్ల గణేశ్

షార్ట్స్‌లో చూడండి
నిర్మాతగా బండ్ల గణేశ్ .. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. తన సినిమాలకి సంబంధించిన ఆడియో వేదికలపైన ఆయన హీరోలను తెగ పొగిడేస్తూ ఉంటారు. అదే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " పొగడ్త అనేది నేను కనిపెట్టింది కాదు సార్ .. దేవుళ్లనే పొగుడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది .. దేవుడి లాంటి హీరోలను పొగిడితే తప్పేంటని నేను అనుకుంటాను.

పొగడ్తల ద్వారా ఎనర్జీ ఇవ్వడం తప్పుకాదనేది నా అభిప్రాయం. ఒక హీరో ఒక సినిమా చేయడం వలన కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి. అలాంటి హీరోను పొగడొచ్చు. వ్యాపారంలో భాగంగానే పొగడటం జరుగుతుంది. నా సినిమా అప్పుడు సినిమాతో పాటు నా హీరోను పొగిడితే .. మంచి ఓపెనింగ్స్ వచ్చి హిట్ అయితే, అప్పుడు మరో నాలుగు సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుందనేది నా ఫీలింగ్. ఇలా కొంతమంది జీవితాలను నిలబెట్టే హీరోలను పొగడొచ్చు .. తప్పులేదు" అని చెప్పుకొచ్చారు.     
Go Back to Shorts
bandla ganesh

More Telugu News