'గంగోత్రి'లో అవకాశం ఇచ్చి, చొక్కా, నిక్కర్ కొలతలు అడిగారు... సింపుల్ గా వద్దనేసి వచ్చేశా: హిట్ చిత్రాల దర్శకుడు బాబీ
- 'గంగోత్రి'లో ఓ పాత్రకు చిన్నికృష్ణ అవకాశం ఇప్పించాడు
- చొక్కా, నిక్కర్ అనేసరికి వద్దని చెప్పేశాను
- చిన్ని కృష్ణకు కోపం వచ్చింది
- నా కష్టాలు మొదటికి వచ్చాయి: బాబీ
తనకు సినిమా పిచ్చి ఉందని తెలుసుకుని, రాఘవేంద్రరావును కలవాలని పంపించాడని, అప్పుడే 'గంగోత్రి' సినిమా తయారవుతుండగా, అల్లు అర్జున్ ఫ్రెండ్స్ గా ఎనిమిది మంది కావాలని చెప్పి, తనకు, తన ఫ్రెండ్ కిషోర్ కు వేషం ఇస్తూ, "బయట కాస్ట్యూమ్ డిజైన్ ఉంటాడు. వెళ్లి చొక్కా, నిక్కర్ కొలతలు ఇచ్చి వెళ్లండి" అని రాఘవేంద్రరావు చెప్పారని అన్నాడు. మూడో తరగతి నుంచే నిక్కర్లు వదిలేసి ప్యాంట్లకు మారిన తనకు నిక్కర్ వేసుకోవడం ఇష్టం లేక, ఆ పాత్రను వద్దని చెప్పి వచ్చేశానని, తన వైఖరితో చిన్నికృష్ణకు కూడా కోపం వచ్చిందని చెప్పాడు. ఆ ఘటనతో తన కష్టాలు మొదటికి వచ్చాయని చెప్పుకొచ్చాడు.