India: శ్రీలంక టపటపా... గంట వ్యవధిలో 3 వికెట్లు ఫట్!

  • ఈ ఉదయం డిక్ వెలా, చండీమల్ అవుట్
  • డక్కౌట్ అయిన షనాక
  • లంక స్కోరు 58 ఓవర్లలో 209/7
ఇండియాతో పోలిస్తే కాసిన్ని పరుగులు అధికంగా చేశారే తప్ప, శ్రీలంక బ్యాటింగ్ పరిస్థితి కూడా ఇండియాను తలపించింది. రెండు రోజుల పాటు వరుణుడు అడ్డుకున్న కోల్ కతా టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌట్ కాగా, ప్రతిగా నిన్న నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి, ఈ ఉదయం ఆట ప్రారంభించిన శ్రీలంక, తొలి గంట వ్యవధిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.

53వ ఓవర్ లో డిక్ వెలా (35), 54వ ఓవర్ లో షనాక (0), 55వ ఓవర్ లో చండీమల్ (28) పరుగులు చేసి అవుట్ అయ్యారు. షనాక వికెట్ ను భువనేశ్వర్ కుమార్ తీసుకోగా, మిగతా రెండూ మహమ్మద్ షమీ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం పెరీరా, హెరాత్ లు ఆడుతుండగా, లంక స్కోరు 58 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు.
India
Sri Lanka
test cricket
eden gardens

More Telugu News