nandi awards: నా మాటలన్నీ ఓన్... వెనుక ఏ శక్తీ లేదు: దర్శకుడు గుణశేఖర్

  • నంది అవార్డుల విషయంలో కొనసాగుతున్న దుమారం
  • గుణశేఖర్ అసహనం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపణలు
  • బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్
గత వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో దుమారం కొనసాగుతున్న వేళ, దర్శకుడు గుణశేఖర్, తన 'రుద్రమదేవి' చిత్రానికి అవార్డులు లభించకపోవడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణల వెనుక ఏదో శక్తి ఉందని, ఆ శక్తే గుణశేఖర్ తో విమర్శలు చేయిస్తోందని కొంతమంది వ్యాఖ్యానించిన దరిమిలా, గుణశేఖర్ స్పందించాడు.

తన వెనుక ఎలాంటి శక్తీ లేదని, తన మాటలన్నీ హృదయం నుంచి వచ్చినవేనని, 'రుద్రమదేవి'కి అవార్డులు రాలేదన్న బాధ తనకుందని చెప్పుకొచ్చాడు. రాంగోపాల్ వర్మ వంటి దర్శకుడి కామెంట్లను కూడా ప్రతికూలంగా తీసుకుని ఆయనపై విరుచుకుపడటం సరికాదని అభిప్రాయపడ్డాడు. 'రుద్రమదేవి'లో సందేశం లేదని జ్యూరీ కమిటీ సభ్యులు చేసిన వ్యాఖ్యనూ గుణశేఖర్ ఖండించాడు.
nandi awards
gunashekhar
ramgopal varma

More Telugu News