Nagarjuna: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నాగార్జున సోదరి నాగ సుశీల!

  • చింతలపూడి శ్రీనివాస్ మోసం చేశారు
  • మాకు తెలియకుండానే మా ఆస్తులను అమ్మేశారు
  • కఠినంగా శిక్షించండి
ప్రముఖ సినీ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ భూములను చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తమ అనుమతి లేకుండానే విక్రయించాడని, నగదును దుర్వినియోగం చేశారని, పంజగుట్ట పీఎస్ లో ఆమె ఫిర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఈ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో, శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాస్ టాలీవుడ్ లో పలు సినిమాలు తీశారు. నాగ సుశీల, శ్రీనివాస్ లకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.
Nagarjuna
naga suseela
chintalapudi sreenivas

More Telugu News