serena williams: ఘ‌నంగా జ‌రిగిన సెరెనా, అలెక్సిస్‌ల వివాహం.. అతిథులు మాత్రం కొద్ది మందే!

షార్ట్స్‌లో చూడండి
మాజీ ప్ర‌పంచ నెం.1 టెన్నిస్ స్టార్ సెరెనా విలియ‌మ్స్‌, త‌న బాయ్‌ఫ్రెండ్‌, రెడ్డిట్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు అలెక్సిస్ ఒహానియ‌న్‌ను గురువారం రాత్రి పెళ్లి చేసుకుంది. అతి త‌క్కువ మంది అతిథుల‌తో న్యూ ఓర్లిన్స్‌లోని కాంటెంప‌ర‌రీ ఆర్ట్స్ సెంట‌ర్‌లో ఈ వేడుక జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు పాప్ గాయ‌ని బియోన్సే, న‌టి కిమ్ క‌ర్దాశియ‌న్‌, టెన్నిస్ క్రీడాకారిణి, సెరెనా స్నేహితురాలు క‌రోలిన్ వోజ్నియాకి, హాలీవుడ్ న‌టి ఈవా లాంగోరియా హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.

వారి పెళ్లి ఫొటోలు లీక్ అవ‌కుండా ఉండేందుకు అతిథుల ఫోన్ల‌ను ప్రాంగ‌ణంలోకి తీసుకురానివ్వ‌లేదు. అలాగే త‌మ వేడుక ఫొటోల‌ను ప్ర‌చురించేలా వోగ్ మేగ‌జైన్‌తో సెరెనా, అలెక్సిస్‌లు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారి వివాహ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను సెరెనా, అలెక్సిస్‌లు త‌మ ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో పోస్ట్ చేశారు. వోగ్ మేగ‌జైన్ కూడా వేడుక ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టింది.
Go Back to Shorts
serena williams
alexis ohanian
marriage
new orleans
beyonce
kim kardasian

More Telugu News