Mahesh Babu: బిజినెస్ పరంగా మహేశ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదట!

  • వైజాగ్ ఏరియా హక్కులే 11 కోట్లు పలికే ఛాన్స్ 
  • మిగతా ఏరియాల నుంచి అదే స్థాయి డిమాండ్ 
  • శాటిలైట్ హక్కుల కోసం గట్టి పోటీ
టాలీవుడ్ అగ్రకథానాయకులలో మహేశ్ బాబు ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తాడు. అయన సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి థియేటర్స్ కి వచ్చేంత వరకూ అభిమానులు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. అలాంటి మహేశ్ బాబు ఈ మధ్య రెండు భారీ పరాజయాలను ఎదుర్కున్నాడు. 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరిచాయి. ఈ పరాజయాల ప్రభావం ఆయన తదుపరి చిత్రమైన 'భరత్ అనే నేను' పై పడుతుందని అంతా భావించారు.

 కానీ అలా ఎంత మాత్రం జరగడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా వైజాగ్ ఏరియా హక్కులే 11 కోట్ల వరకూ పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ఏరియాల నుంచి కూడా ఇదే స్థాయి డిమాండ్ కనిపిస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ కోసం కూడా ఓ మూడు చానల్స్ గట్టిగానే పోటీ పడుతున్నాయట. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'శ్రీమంతుడు' వంటి భారీ విజయం ఉండటమే ఈ స్థాయి డిమాండ్ కి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
Mahesh Babu

More Telugu News