bandla ganesh: పూరీ అంటే ఇష్టం .. త్రివిక్రమ్ అంటే గౌరవం: బండ్ల గణేశ్

  • ఏదైతే చెబుతాడో పూరీ అదే తీస్తాడు
  • సినిమాను త్రివిక్రమ్ ప్రేమిస్తాడు
  • ఇలాంటివాళ్లు ఇండస్ట్రీకి అవసరం  
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ .. తన కెరియర్ కి సంబంధించిన విషయాలు .. తనకు ఎదురైన అనుభవాల గురించి ప్రస్తావించారు. 'చిత్ర పరిశ్రమలో మీకు ఇష్టమైన మేకర్స్ గురించి చెప్పండి?" అనే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ లో ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. "మీరు తప్పుగా అనుకోవద్దూ .. ఏంటి ఈ మధ్య ప్లాపులు తీస్తున్నాడని అనుకోవద్దు. నాకు బాగా ఇష్టమైన మేకర్ పూరీ జగన్నాథ్" అని అన్నారు.

"రైటా . . రాంగా అనేది పక్కన పెడితే ఫటా ఫటా మంటూ సినిమాలు చేసేస్తాడు. ఏదైతే కథ చెబుతాడో .. ఏదైతే సీన్ చెబుతాడో అదే సినిమాలో ఉంటుంది .. ఎక్స్ ట్రాగా ఒక్క షాట్ కూడా ఉండదు . అందుకే పూరీ అంటే ఇష్టం. ఇక సినిమా అంటే భక్తి .. భయం ఉంటూ సినిమాను ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికేవాడు త్రివిక్రమ్ .. అందుకే ఆయనంటే నాకు గౌరవం. ఇండస్ట్రీ చల్లగా వుండాలని కోరుకునే వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు .. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం" అని చెప్పుకొచ్చారు.       
bandla ganesh
Puri Jagannadh
trivikram

More Telugu News