praksh raj: కేంద్రం చాలా తప్పులు చేస్తోంది... ఏపీని నమ్మించి మోసం చేసింది!: ప్రకాశ్ రాజ్ ఫైర్

  • మౌలిక వసతులు లేకుండా రాజధానిని ఎలా నిర్మిస్తారు?
  • రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా?
  • ఏపీకి ఎందుకు న్యాయం చేయడం లేదు?
కేంద్రప్రభుత్వం చాలా తప్పులు చేస్తోందని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆరోగ్యకరమైన విధానం నాశనమవుతోందని అన్నారు. విమర్శను ప్రభుత్వం భరించలేకపోతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే.. ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎవరినడిగినా చెబుతారని ఆయన చెప్పారు. బీజేపీ కూడా అదే విషయాన్ని చెప్పిందని ఆయన అన్నారు. సాక్షాత్తూ ప్రధాని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా సహా అన్నీ ఇస్తామని అన్నారని గుర్తు చేశారు.

 అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని, మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదని అన్నారు. దీనిని మోసం చేయడం కాకపోతే మరేమని అనాలని ఆయన ప్రశ్నించారు. అంతెందుకు, దేశంలో సరైన రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? అని ఆయన అడిగారు. ఏపీకి ఎందుకు న్యాయం జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. సరైన మౌలిక వసతులు లేకుండా కొత్త రాజధానిని ఎలా నిర్మించాలనుకున్నారని ఆయన నిలదీశారు. దీనిని ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా? అన్న ఆయన... అలా ప్రశ్నిస్తే దేశద్రోహులు లేదా ఇంకోటి, అదీ కాకపోతే మరోటి అంటున్నారని, లేదా దాడులు చేస్తామంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇది సరికాదని ఆయన హితవు పలికారు.
praksh raj
Andhra Pradesh
specialstatus

More Telugu News