జనవరిలోనే 'భాగమతి' .. '2.0' సమ్మర్ కి వెళ్లినట్టే!
- అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి'
- జనవరి 26వ తేదీన విడుదల
- జనవరి 25న '2.0' లేనట్టే
- ఇది దాదాపు సమ్మర్ కి వెళ్లినట్టే
కానీ జనవరి 26నే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఈ సినిమా టీమ్ తాజాగా ప్రకటించింది. '2.0'కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడం వలన, ఆ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే వున్నాయి. తాజాగా 'భాగమతి' రిలీజ్ డేట్ ఖరారు కావడంతో, జనవరిలో '2.0' రానట్టేనని అంటున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కే వస్తుందని చెబుతున్నారు.
'భాగమతి' నిర్మాతలకి తమిళ చిత్రపరిశ్రమతోను మంచి సంబంధాలు వున్నాయి. అందువలన అన్ని విషయాలను తెలుసుకునే వాళ్లు 'భాగమతి' రిలీజ్ డేట్ ప్రకటించి వుంటారు గనుక .. '2.0' రిలీజ్ వాయిదా పడిందనేది స్పష్టమైపోయింది.