sasikala: శశికళ భర్త నటరాజన్ కు రెండేళ్ల జైలు శిక్ష

  • కారు దిగుమతి కేసులో శిక్ష
  • 23 ఏళ్ల నాటి కేసు
  • శశికళకు మరో షాక్
అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న జయలలిత నెచ్చెలి శశికళకు మరో షాక్ తగిలింది. ఆమె భర్త నటరాజన్ కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. 23 ఏళ్ల నాటి కారు దిగుమతి కేసులో నటరాజన్ ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, 1994లో లెక్సస్ కంపెనీకి చెందిన ఓ ఖరీదైన కారును బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారు నటరాజన్. ఈ కారును అతని బంధువు భాస్కరన్ కు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. కారుకు సంబంధించిన రూ. 1.62 కోట్ల సుంకాన్ని ఎగ్గొట్టేందుకు... ఆ కారును యూజ్డ్ కారుగా చూపించారు. 2010లో కేసుకు సంబంధించిన తుది తీర్పుపై స్టే విధించిన హైకోర్టు... ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. 
sasikala
natarajan
imprisionment for natarajan

More Telugu News