asi mohan reddy: రాచమర్యాదల నడుమ జైలులోనే ఏఎస్ఐ మోహన్ రెడ్డి సాగిస్తున్న దందా... రహస్యంగా తీసిన వీడియో చూడండి!

  • దందాలు, బెదిరింపులకు పాల్పడి జైల్లో ఉన్న మోహన్ రెడ్డి
  • సూపరింటెండెంట్ గదిలో రాచమర్యాదలు
  • కుటుంబీకులతో కలసి సెటిల్ మెంట్లు
పలు దందాలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు, సెటిల్ మెంట్లకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయి, ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఏఎస్ఐ మోహన్ రెడ్డి ములాఖత్ ల మాయాజాలానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. జైల్లో సూపరింటెండెంట్ గదిలో రాచమర్యాదలు అందుకుంటున్న ఆయన అక్కడి నుంచే సెటిల్ మెంట్లు సాగిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.

సూపరింటెండెంట్ గదిలో దర్జాగా సోఫాలో కూర్చుని, తన భార్య, కుటుంబీకులతో కలసి మోహన్ రెడ్డి సెటిల్ మెంట్లు చేస్తున్న దృశ్యాలను ఓ ఉద్యోగి రహస్యంగా తన స్మార్ట్ ఫోన్ లో వీడియో తీసి బయటకు వదిలాడు. వీడియో తీసిన వ్యక్తి ఎవరన్న విషయం వెల్లడికాలేదు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలంగాణ జైళ్ల శాఖ ప్రకటించినప్పటికీ, మోహన్ రెడ్డి సెటిల్ మెంట్లు సాగుతున్న తీరు, జైళ్లలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. సదరు వీడియోను మీరూ చూడవచ్చు.

asi mohan reddy
karimnagar
jail

More Telugu News