aravind swamy: 'పద్మావతి' సినిమాపై నటుడు అరవిందస్వామి కామెంట్స్

  • సినిమాలు మనసును వికసింపజేస్తాయి
  • పద్మావతి శ్రీలంకకు చెందిన యువరాణి అని చదివాను
  • ఆమెకు సంబంధించిన వివరాలు చరిత్రలో లేవు
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ పుత్ రాణి పద్మావతిని అగౌరవపరిచే రీతిలో చూపించారంటూ రాజ్ పుత్ కర్ణి సేన ఆందోళనలకు దిగుతోంది. భన్సాలీ తల నరకండి, దీపికా పదుకొనే ముక్కు కోయండంటూ ఇప్పటికే పిలుపిచ్చింది. సినిమా విడుదలను ఆపకపోతే, డిసెంబర్ 1న భారత్ బంద్ చేపడతామని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో, ఈ సినిమాపై ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి స్పందించాడు. ఆర్ట్ అనేది మనసును వికసింపజేస్తుందని, మనలోని కుతూహలాన్ని ప్రేరేపిస్తుందని అన్నాడు. మాలిక్ మమహ్మద్ రాసిన గేయాన్ని తాను చదివానని... అందులో సింహళ (శ్రీలంక)కు చెందిన యువరాణిగా పద్మావతిని పేర్కొన్నారని చెప్పాడు. చరిత్రలో ఇంతకు మించి ఆమెకు సంబంధించిన వివరాలు తనకు దొరకలేదని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
aravind swamy
padmavathi movie
rajput karni sena
sanjayleela Bhansali
deepika padukone
bollywood

More Telugu News