maddineni ramesh: 'బన్నీ'గాళ్లు, 'బుజ్జి'గాళ్లు, 'బండ్ల'గాళ్లు... దర్శకుడు మద్దినేని రమేష్ తిట్ల పురాణం!

  • విమర్శలు గుప్పించిన దర్శకుడు మద్దినేని రమేష్
  • రాంగోపాల్ వర్మకు బుద్ధిరాలేదని నిప్పులు
  • ఎవరికీ భయపడేది లేదన్న రమేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు. రాంగోపాల్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ, కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు.

'బన్నీ'గాళ్లు, 'బుజ్జి'గాళ్లు, 'బండ్ల'గాళ్లు అంటూ నంది అవార్డుల విధానాన్ని విమర్శించిన బన్నీ వాసు, నల్లమలుపు బుజ్జి, బండ్ల గణేశ్ తదితరులనూ వదల్లేదు. బక్కగాళ్లు, బలుపుగాళ్లు, బఫూన్లకు బయపడేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
maddineni ramesh
ramgopal varma
nandi awards

More Telugu News