నెహ్రూను స్త్రీలోలుడిగా చూపే ప్రయత్నం.. తప్పులో కాలేసిన బీజేపీ!
- కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలనుకుని బొక్కబోర్లా పడిన అమిత్
- సోదరిని ఆత్మీయంగా హత్తుకున్న నెహ్రూ ఫొటోలు పోస్ట్
- మాలవీయపై మండిపడుతున్న నెటిజన్లు
అయితే ఆయన పోస్ట్ చేసిన 9 ఫొటోల్లో రెండింటిలో నెహ్రూను హత్తుకున్నది ఆయన సోదరి విజయలక్ష్మి కాగా, మిగతావి కూడా అంత అభ్యంతరకరంగా లేవు. ఈ ఫొటోలపై స్పందించిన నెటిజన్లు అమిత్ మాలవీయపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన అజ్ఞానాన్ని, నీచబుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఇటువంటి పోస్టులు పెట్టేముందు ఒకసారి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దని అమిత్‌కు కొందరు సలహా కూడా ఇస్తున్నారు.