warangal: బిర్యానీ వండడం రాదని పొమ్మన్న భర్త... ఇంటి ముందు మౌనపోరాటానికి దిగిన భార్య!

  • 7 లక్షల కట్నంతో వివాహం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్
  • బిర్యానీ వండడం రాదన్న నెపంతో పుట్టింటికి పంపేశాడు 
  • భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య 
బిర్యానీ వండటం రాదన్న సాకుతో పెళ్ళైన రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపిన భర్త ఇంటిముందు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ దీక్షకు దిగిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ కు ఖాజిపేటదర్గాకు చెందిన మానసతో 2016 నవంబర్లో వివాహం జరిగింది. వివాహ సమయంలో వరకట్నంగా యువతి తల్లిదండ్రులు 7 లక్షల రూపాయలు అందజేశారు.

ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ, రోజూ తాగి వచ్చే రాజేంద్రప్రసాద్ బిర్యానీ వండడం రాదన్న నెపంతో రెండు నెలలకే భార్యను పుట్టింటికి పంపాడు. పది నెలలు గడిచినా తీసుకెళ్లేందుకు రాకపోవడంతో బాధితురాలు భర్త ఇంటిముందు న్యాయపోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు దీక్షకు కారణాలు ఆరాతీసి ఆశ్చర్యపోయారు. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి నుంచి కదిలేదిలేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది. 
warangal
marriage
biryani
Fight for justice
wife Fight for justice

More Telugu News