kadapa: కడపజిల్లాలో కాల్పుల కలకలం..వైఎస్సార్సీపీ నేత కాల్పుల్లో గాయపడ్డ టీడీపీ నేతలు

  • వీఎన్ పల్లి మండలం ఈర్లపల్లిలో కాల్పులు
  • టీడీపీ నేతలపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపిన వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి
  • గాయపడ్డ టీడీపీ నేతలు భాస్కరరెడ్డి, వాసుదేవరెడ్డి
కడప జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. కడప జిల్లా వీఎన్ పల్లి మండలం ఈర్లపల్లిలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు భాస్కరరెడ్డి, వాసుదేవరెడ్డితో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డికి సుదీర్ఘ కాలంగా విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ నేత ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టీడీపీ నేతలిద్దరూ గాయాలపాలయ్యారు. బంధువులు వారిని హుటాహుటీన ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  
kadapa
firing
Telugudesam
YSRCP

More Telugu News