ramasubba reddy: కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పదవీయోగం.. రేపో, మాపో ఉత్తర్వులు

  • గతంలో మంత్రిగా పని చేసిన రామసుబ్బారెడ్డి 
  • తాజాగా మండలి విప్ పదవికి ఎంపిక
  • రేపో, మాపో ఉత్తర్వులు
కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పదవీయోగం దక్కింది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించిన చంద్రబాబు... ఇప్పుడు మండలిలో విప్ పదవికి ఎంపిక చేశారు. గతంలో మంత్రిగా పని చేసిన రామసుబ్బారెడ్డికి... ఆదినారాయణ రెడ్డి మంత్రి కావడంతో అసహనం కలిగింది. రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతోందని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో, తనకు సముచిన స్థానాన్ని కల్పించి, గౌరవాన్ని నిలబెట్టాలని చంద్రబాబును కోరారు. దీంతో, ఆయనకు విప్ పదవిని కట్టబెట్టారు. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
ramasubba reddy
jammalamadugu

More Telugu News