marriage: కాబోయే భార్యను తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ లో వచ్చిన వరుడు!

షార్ట్స్‌లో చూడండి
వివాహాన్ని ఘనంగా చేసుకోవడాన్ని అందరూ ఆస్వాదిస్తారు. కాబోయే భార్య కోరిక తీర్చేందుకు సినిమా తరహాలో షారూఖ్ అనే వరుడు హెలికాప్టర్‌ లో దిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌ లోని జైపూర్ కి చెందిన షారూఖ్ అనే కుర్రాడికి ఉత్తరప్రదేశ్‌ కి చెందిన తాన్జిమ్‌ తో వివాహం నిశ్చయమైంది.

ఆ తరువాత మాటల మధ్యలో తనకు కాబోయే భర్త హెలికాప్టర్ లో వచ్చి తనను తీసుకెళ్లాలన్న కోరిక తనకు ఉందని తాన్జిమ్, షారూఖ్ కు చెప్పింది. దీంతో తాన్జిమ్ ను వివాహం చేసుకునేందుకు షారూఖ్ నిజంగానే హెలికాప్టర్ లో వచ్చాడు. వివాహానంతరం అదే హెలికాప్టర్ లో ఆమెను మెట్టినింటికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది. 
Go Back to Shorts
marriage
rajasthan
uttarpradesh

More Telugu News