Kamal Haasan: అభిమానులు సేకరించిన 30 కోట్ల విరాళాలను తిరిగిచ్చేస్తా!: కమలహాసన్

  • అభిమానులు సేకరించిన విరాళాలను తిరిగిచ్చేస్తా
  • పార్టీకి పేరు కూడా పెట్టకుండానే విరాళాలు దాచుకుంటే నేరం అవుతుంది
  • ఇతర మతస్తులకు హిందువులు అన్నలాంటి వారు
రాజకీయ పార్టీని పెట్టడం కోసం తన అభిమానులు రూ. 30 కోట్ల విరాళాలను సేకరించారని నటుడు కమలహాసన్ గతంలో ప్రకటించారు. ఆ డబ్బునంతా తిరిగి ఇచ్చేస్తామని తాజాగా ఆయన ప్రకటించారు. ఓ తమిళ మేగజీన్ కి రాసిన ఆర్టికల్ లో ఆయన ఈ విరాళాల గురించి తెలిపారు. తమ పార్టీకి ఇంకా పేరే పెట్టలేదని... ఎలాంటి సదుపాయాలు లేకుండానే సేకరించిన విరాళాలను దాచుకుంటే అది నేరమవుతుందని ఆర్టికల్ లో పేర్కొన్నారు.

దీని అర్థం తాను తప్పుకుంటున్నానని కానీ, విరాళాలను తీసుకోనని కానీ కాదని చెప్పారు. హిందూ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ... దేశంలో అధిక జనాభా హిందువులదేనని... ఇతర మతస్తులకు హిందువులు అన్నల్లాంటి వారని... ఇతర మతాలవారిని అక్కున చేర్చుకోవాలని... వారు తప్పు చేస్తే సరిదిద్దాలని తెలిపారు. 
Kamal Haasan
kollywood
tamil politics
kamal party

More Telugu News