Sania Mirza: సానియా.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నా: షోయబ్ మాలిక్

  • 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సానియా
  • వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • ట్విట్టర్లో విషెస్ చెప్పిన షోయబ్
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిన్న 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 'అందమైన నా భార్యకు మ్యాజికల్ బర్త్ డే విషెస్' అంటూ ట్వీట్ చేశాడు. సానియాను ఎంతో మిస్ అవుతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలసి దిగిన ఓ ఫొటోను కూడా అప్ లోడ్ చేశాడు. మరోవైపు, పుట్టిన రోజు సందర్భంగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు క్రీడాకారులు, బాలీవుడ్ స్టార్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 
Sania Mirza
shoib malik
sania birthday

More Telugu News