mahesh kathi: చివరకు మీరే వెధవలు అవుతారు: పవన్ ఫ్యాన్ ను ఉద్దేశించి కత్తి మహేష్ కామెంట్

  • హైపర్ ఆదితో ఫొటో దిగి, పోస్ట్ చేసిన మహేష్ కత్తి
  • మా మధ్య వైరాలు ఉండవు
  • పవన్ తో కూడా ఇలాగే ఫొటో దిగగలను
జబర్దస్త్ ఫేం హైపర్ ఆది తనపై చేసిన కామెంట్స్ పై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇది జరిగి కొన్ని రోజులు కూడా తిరగక ముందే అదే ఆదితో కలసి ఫొటో దిగాడు మహేష్. నిన్న హైదరాబాద్ లో 'లండన్ బాబులు' ప్రీమియర్ షోను చిత్ర యూనిట్ వేసింది. ఈ షోకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేష్, హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరు ఫొటోలకు పోజులిచ్చారు. తాజాగా, ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు కూడా చేశాడు.

"మేమంతా బాగానే కలిసి ఉంటాం. మా మధ్య వ్యక్తిగత వైరాలు ఉండవు. సిద్ధాంతాల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయి. ఈ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే వాళ్లు వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటారు. నాయనలారా... మేలుకోండి. రేపో, మాపో పవన్ కల్యాణ్ ను కలిసినా, ఇలాగే నవ్వుతూ ఫొటో దిగగలను. ఆ తర్వాత మీరే వెధవలు అవుతారు" అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
mahesh kathi
hyper adi
pawan kalyan
tollywood

More Telugu News