Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివ‌ల్‌కి హాజ‌రుకానున్న సీఎం చంద్ర‌బాబు

  • నేటితో ముగియ‌నున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివ‌ల్‌
  • నిన్న వాతావ‌ర‌ణం అనుకూలించ‌క ఎగ‌ర‌ని బెలూన్లు
  • అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌ని సంద‌ర్శ‌కులు
విశాఖ‌లోని అర‌కులోయ‌లో జ‌రుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివ‌ల్‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇవాళ హాజ‌రుకానున్నారు. మూడు రోజుల వేడుక‌లో ఇవాళ చివ‌రి రోజు కావ‌డంతో సంద‌ర్శ‌కుల తాకిడి పెరిగింద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. నిన్న వాతావ‌ర‌ణం అనుకూలించ‌క బెలూన్లు ఎగ‌ర‌క‌పోయినప్ప‌టికీ వేడుక‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న ఇత‌ర సాంస్కృతిక కార్యక్ర‌మాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, అర‌కు ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయ‌ని వారు అన్నారు.

అరకు లోయలో మొద‌టిసారి నిర్వ‌హిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివ‌ల్‌ను ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఢిల్లీకి చెందిన‌ ఈ-ఫ్యాక్ట‌ర్‌, స్కైవాల్ట్జ్ సంస్థ‌ల‌తో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. ఈ ఫెస్టివ‌ల్‌లో పాల్గొన‌డానికి అమెరికా, స్విట్జ‌ర్లాండ్‌, జ‌పాన్‌, మ‌లేషియా, తైవాన్ వంటి 13 దేశాల‌కు చెందిన ఔత్సాహికులు హాజ‌ర‌య్యారు.
hot air
balloon
festival
araku valley
cm
Andhra Pradesh
Chandrababu
Vizag

More Telugu News