polavaram: తెలుగు ప్రజల తలరాతలు మారిపోతాయ్: నందమూరి బాలకృష్ణ

  • పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కదిలిన ఎమ్మెల్యేలు
  • తోటి ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో ప్రయాణించిన బాలయ్య
  • సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తవుతుంది
  • రాయలసీమకు చాలినంత నీరిస్తాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, తెలుగు ప్రజల తలరాతలు మారిపోతాయని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించేందుకు తోటి ఎమ్మెల్యేలతో కలసి ప్రత్యేక బస్సులో బయలుదేరిన ఆయన టీవీ చానళ్లతో మాట్లాడారు.

ప్రజల భవిష్యత్తును మార్చివేసే ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. రెండు నదులను అనుసంధానం చేయడం ఏపీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమమని అభివర్ణించారు. వెనుకబడిన రాయలసీమకు చాలినంత నీరు ఇస్తామని చెప్పారు. వృథాగా సముద్రంలో కలిసిపోయే నీరును రైతుల పొలాలకు మళ్లిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు సమూలంగా మారిపోతాయని తెలిపారు.
polavaram
Balakrishna
Chandrababu

More Telugu News