ivanka trump: హైదరాబాద్ పర్యటనపై ట్వీట్ పెట్టిన ఇవాంకా... వెంటనే స్పందించిన మోదీ!

  • నెలాఖరులో ఇండియాకు రానున్న ఇవాంకా
  • హైదరాబాద్ లో జరిగే జీఈఎస్ కు హాజరు
  • ఇండియా వెళుతున్నానని ట్వీట్ చేసిన ఇవాంకా
  • వెల్ కమ్ చెప్పిన నరేంద్ర మోదీ
ఈ నెలాఖరులో ఇండియాకు వచ్చి, హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరు కానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, తన భారత పర్యటనపై ఓ ట్వీట్ చేయగా, ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. "ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్య వేత్తలను కలుసుకునేందుకు నేను ఇండియా వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది" అని ఇవాంకా వ్యాఖ్యానించగా, మోదీ ఆమెకు స్వాగతం పలికారు. "మీ రాకతో భారత్, అమెరికా మధ్య ఆర్థికబంధం బలపడుతుంది. ఇండియాలోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం" అని అన్నారు.
ivanka trump
Narendra Modi
GES
hyderabad

More Telugu News