actor bhuvaneshwari: కాలేజీ అమ్మాయిని వేధించిన కేసులో నటి భువనేశ్వరి కుమారుడు అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది చిత్రాల్లో పలు వ్యాంప్ క్యారెక్టర్లు చేసి గుర్తింపు పొందిన నటి భువనేశ్వరి కుమారుడు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఓ కాలేజీ విద్యార్థినిని పెళ్లి చేసుకోమంటూ వేధించిన కేసులో అతను ఇరుక్కున్నాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చెన్నైలోని తిరుమలై నగర్, ఏంజల్ వీధిలో భువనేశ్వరి, ఆమె కుమారుడు మిధున్ శ్రీనివాసన్ (23) నివసిస్తున్నారు. అన్నానగర్ లోని ఓ యువతితో అతనికి ఫేస్ బుక్ మాధ్యమంగా స్నేహం ఏర్పడి, అది సన్నిహిత సంబంధంగా మారింది. ఆపై తనను వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చాడు.

ఇటీవల మిధున్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ కూడా చేశాడు. అప్పటికీ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి గొడవ చేశాడు. ఇక మిధున్ వేధింపులు తాళలేక, బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పి తిరుమంగళం పోలీసులను ఆశ్రయించింది. దీంతో మిధున్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
Go Back to Shorts
actor bhuvaneshwari
midhun srinivasan
arrest

More Telugu News