america: భారత్ పై మరోసారి ప్రేమను ఒలకబోసిన అమెరికా!

  • భారత్ మాకు సహజ భాగస్వామి
  • ఇరు దేశాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి
  • ట్రంప్ హయాంలో బంధాలు మరింత బలోపేతం కానున్నాయి
ఇటీవలి కాలంలో భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడుతూ వస్తున్నాయి. తాజాగా భారత్ పై అమెరికా మరోసారి తన అభిమానాన్ని వ్యక్తపరిచింది. భారత్ తమకు ఓ సహజ భాగస్వామ్య దేశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం పేర్కొంది.

ఉగ్రవాదంపై పోరు, ప్రజాస్వామ్యంపై అచంచలమైన విశ్వాసం విషయాల్లో ఇరు దేశాల మధ్య సారూప్యత ఉందని ప్రకటించింది. చైనాతో కంటే భారత్ తోనే తమకు ఎక్కువ పోలికలు ఉన్నాయని చెప్పింది. ట్రంప్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపింది. ఈ మేరకు వైట్ హౌస్ పత్రినిధి రాజ్ షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
america
india
Donald Trump
white house

More Telugu News