delhi: దేశరాజధానిలో పట్టపగలు అందరూ చూస్తుండగా దోపిడీ!

  • ఢిల్లీ లోని మాలవీయ నగర్ లో దోపిడీ
  • బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న వ్యాపారి కమల్ జీత్ సింగ్ పై కాల్పులు, దోపిడీ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమల్ జీత్ సింగ్
దేశ రాజధానిలో పట్టపగలు అందరూ చూస్తుండగా దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని మాలవీయ నగర్ లోని ఒక బ్యాంకులో డబ్బులు డ్రాచేసుకుని వస్తున్న కమల్ జీత్ సింగ్ అనే వ్యక్తిని అనుసరించిన దుండగుడు నడి రోడ్డుమీద తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే దుండగుడికి ఏమాత్రం భయపడని కమల్ జీత్ సింగ్ అతనితో తీవ్రంగా పోరాడాడు.

దీంతో అతనిపై కాల్పులు జరిపిన దుండగుడు బ్యాగుతో సహా పరారయ్యాడు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనలో దుండగుడ్ని అడ్డుకునేందుకు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ప్రయత్నించినప్పటికీ అతనిపై దాడి చేయడంతో అతను వెళ్లిపోయాడు. అనంతరం గాయపడిన కమల్ జీత్ ను ఒక మహిళ ఆసుపత్రిలో చేర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కమల్ జీత్ చిరు వ్యాపారి అని వారు తెలిపారు.
delhi
malaveeya nagar

More Telugu News