america: అమెరికాలో కాల్పుల కలకలం... ఎలిమెంటరీ స్కూల్ లక్ష్యంగా కాల్పులు.. నలుగురి మృతి!

  • ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడి కాల్పులు
  • సెమీ ఆటోమెటిక్ గన్, రెండు హ్యాండ్ గన్స్ తో కాల్పులకు దిగిన కెవిన్
  • నలుగురు మృతి, పదిమందికి గాయాలు
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగుడు విరుచుకుపడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు సహా పదిమందికి తూటాగాయాలైనట్టు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఉత్తర కాలిఫోర్నియాలోని రెడ్ బ్లఫ్ గ్రామీణ ప్రాంతంలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ లోకి సెమీ ఆటోమెటిక్ గన్, రెండు హ్యాండ్ గన్ లతో చొరబడిన కెవిన్ అనే దుండగుడు విద్యార్థులపై కాల్పులు జరిపాడు.

దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తూటాగాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న లా-ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని అతనిని మట్టుబెట్టారు. కెవిన్ వృద్ధుడని, అతను ఎందుకు కాల్పులు జరిపాడో తెలుసుకోవాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. 
america
Northern California
opened fire
Rancho Tehama Elementary school

More Telugu News