YSRCP: జగన్ సీఎం కావాలంటూ యువకుడి ఆత్మహత్య!

  • ప్రాణాలు తీసుకున్న జగన్‌ వీరాభిమాని
  • సోమవారం ప్రతిపక్ష నేత పాదయాత్రలో పాల్గొన్న యువకుడు
  • మరునాడు లేఖ రాసి ఆత్మహత్య
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరుకు చెందిన కాచన శ్రీనివాసులురెడ్డి వైసీపీ చీఫ్ జగన్‌కు వీరాభిమాని.

 సోమవారం టంగుటూరు మెట్ట వద్ద జగన్ నిర్వహించిన పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన ఉదయం జగన్ సీఎం కావాలని సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతితో రాజుపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు నేతలు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
YSRCP
YS Jagan
And
Praja Sankalpa Yatra

More Telugu News