హైదరాబాద్ మెట్రోరైల్ స్టేషన్ల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష!
- తేల్చి చెప్పిన హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ
- విధ్వంసక చర్యలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష
- మెట్రోరైల్ చట్టం ప్రకారం సెక్షన్-74 కింద కఠిన శిక్షలు
- ఈ నెల 28న మెట్రోరైల్ ప్రారంభమయ్యే అవకాశం
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. విధ్వంసక చర్యలకు పాల్పడితే మెట్రోరైల్ చట్టం ప్రకారం సెక్షన్-74 కింద గరిష్టంగా పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో అతిక్రమణలకు పాల్పడితే చిక్కులు ఎదుర్కోవాల్సిందే. కాబట్టి మెట్రో స్టేషన్లలో సీసీ కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే దుండగులు తప్పించుకోలేరు.