hardhik patel: అభిమానులను క్షమించమని కోరిన హార్ధిక్ పాండ్యా

  • సౌతాఫ్రికా టూర్ కోసం ఎదురు చూస్తున్నా
  • మరింత ఫిట్ గా తయారు కావాలనుకుంటున్నా
  • క్రికెట్ అభిమానులకు క్షమాపణలు
ఇటీవలి కాలంలో విరామం లేకుండా క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాడు హార్ధిక్ పాండ్యా శ్రీలంక సిరీస్ కు దూరమయ్యాడు. విశ్రాంతి కావాలంటూ స్వయంగా బోర్డును కోరి, జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, అతి తక్కువ మ్యాచ్ లు మాత్రమే ఆడిన తాను విశ్రాంతి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించే వారందరికీ తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు.

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని... అందుకోసమే తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నానని... సఫారీ సిరీస్ కోసం మరింత ఫిట్ గా తయారవ్వాలని భావిస్తున్నానని చెప్పాడు. తాను రెస్ట్ తీసుకోవడంలో అర్థం లేదని భావిస్తే... అందుకు సారీ అని అన్నాడు. 
hardhik patel
team india
sri lanka series
south africa series

More Telugu News