mohan babu: మనసును కలచివేసింది: మోహన్ బాబు

  • పడవ ప్రమాదం చాలా బాధాకరం
  • బాధితుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం
  • మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా సంతాపం 
విజయవాడలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఈ ఘటనతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దారుణ ఘటనపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

కృష్ణానదిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరందరికీ భగవంతుడు అండగా ఉంటాడని ఆకాంక్షించారు.

ఇదే ప్రమాదంపై హీరో మంచు విష్ణు కూడా స్పందించాడు. కృష్ణానదిలో జరిగిన ప్రమాదం షాక్ కు గురి చేసిందని విష్ణు అన్నాడు. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటిస్తున్నానని ట్వీట్ చేశాడు.
mohan babu
manchu vishnu
tollywood
vijayawada boat accident

More Telugu News