krishna distict: బోటు ప్రమాదంలో 16కు చేరిన మృతుల సంఖ్య.. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు!

  • పవిత్ర సంగమం వద్ద తిరగబడిన బోటు
  • 16 మంది మృతి, ఏడుగురు గల్లంతు
  • ఆస్పత్రుల్లో మరో 9 మంది
  • మృతులు ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు
కృష్ణమ్మ ఒడిలో నిన్న సాయంకాలం పవిత్ర సంగమం వద్ద బోల్తాపడిన బోటు ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. మృతుల్లో 15 మంది ఒంగోలు వాకర్స్ క్లబ్ మెంబర్స్ కాగా, ఒక వ్యక్తి నెల్లూరుకు చెందిన వారుగా నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు నిన్న సాయంత్రం నుంచి గాలింపు చేపట్టాయి.

కాగా, బోటు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ దారుణం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు. కాగా, బోటు యజమాని, సహాయకులు పరారీలో ఉన్నారని వారు తెలిపారు. 
krishna distict
pavitra sanghamam

More Telugu News