samantha: అంగరంగ వైభవంగా చై, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్.. తరలివచ్చిన ప్రముఖులు

  • ఎన్ కన్వెన్షన్ లో వేడుక
  • తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • కొత్త దంపతులకు శుభాకాంక్షల వెల్లువ
టాలీవుడ్ కొత్త జంట నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. కొత్త జంటతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులు వేదిక వద్దకు చేరుకున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు తరలి వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఉత్తేజ్, ఆర్ నారాయణమూర్తి తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.
samantha
naga chaitanya
nagarjuna

More Telugu News