rahul gandhi: మోదీకి, మాకు ఉన్న తేడా అదే!: రాహుల్ గాంధీ

  • మోదీ పొరపాట్లు చేసినంత మాత్రాన అగౌరవపరచాల్సిన అవసరం లేదు
  • మోదీ ప్రతిపక్షంలో ఉంటే ప్రధానిని అవమానించేవారు
  • పండగలకు, పబ్బాలకు ట్వీట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తనకు ఎంతో గౌరవం ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని హోదాలో మోదీ కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమేనని... అంతమాత్రాన, ఆయనను అగౌరవపరచాల్సిన అవసరం లేదని చెప్పారు. గుజరాత్ లోని బనస్కాంతలో జరిగిన బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ప్రధానమంత్రికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, అవహేళన చేసేవారని... అయితే, కాంగ్రెస్ కు అలాంటి అలవాటు లేదని అన్నారు. తాము కేవలం ప్రధాని చేస్తున్న పొరపాట్లు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలను మాత్రమే ఎత్తి చూపుతున్నామని తెలిపారు.

తనకు నలుగురితో కూడిన ట్విట్టర్ టీమ్ ఉందని... తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నానని.. వారికి సలహాలు, సూచనలు ఇస్తానని... ఆ తర్వాత తన టీమ్ ట్వీట్లు చేస్తుందని చెప్పారు. పండగలకు, పబ్బాలకు, ఇతర పర్వదినాలకు శుభాకాంక్షలు చెప్పడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. 
rahul gandhi
congress
Narendra Modi
pm of india

More Telugu News