సినిమాల్లో నా తొలి ముద్దు నానికి ఇచ్చాను: లావణ్య త్రిపాఠి
- సినిమాల్లోకి వచ్చిన తరువాత తొలి ముద్దు నానికి పెట్టాను
- నా తొలి డైలాగ్ 'త్వరగా నాకు పెళ్లి చేసెయ్యండి నాన్నా'
- మోడలింగ్ ద్వారా వచ్చిన తొలి పారితోషికం 5,000 అమ్మకిచ్చేశా
ఇక సినిమాలలో ముద్దు సన్నివేశాల గురించి చెప్పాలంటే, తొలి ముద్దును ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నాని బుగ్గపై పెట్టానని అంది. అలాగే సినిమాల్లో తొలి డైలాగు ఏమిటంటే, 'త్వరగా నాకు పెళ్లి చేసెయ్యండి నాన్న' అన్న డైలాగ్ అని చెప్పింది. మోడలింగ్ లో తొలిసారి ర్యాంప్ వాక్ చేసినప్పుడు 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చారని దానిని తన తల్లికి ఇచ్చేశానని తెలిపింది. తన తొలి సినిమా పారితోషికం కూడా తన తల్లికి ఇచ్చేశానని ఆమె వెల్లడించింది.