sadananda gouda: 'నరేంద్ర మోదీకి సిగ్గుండాలి' అని వ్యాఖ్యానించి నాలిక్కరుచుకున్న కేంద్ర మంత్రి!

  • దక్షిణ కర్ణాటకలోని బంట్వాళలో బీజేపీ పరివర్తన యాత్ర
  • యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి సదానందగౌడ, యడ్యూరప్ప
  • సిద్ధరామయ్యను తిట్టబోయి నరేంద్రమోదీని తిట్టేసిన వైనం 
'నరేంద్ర మోదీకి సిగ్గుండాలి' అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పొరపాటును గుర్తించి నాలిక్కరుచుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా దక్షిణ కర్ణాటకలోని బంట్వాళలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో సదానందగౌడ, యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభికులనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సరిగా లేదని అన్నారు. అదే జోరులో ‘కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నరేంద్రమోదీకి సిగ్గుండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనబోయి నరేంద్రమోదీ అనేశారు. దీంతో సహచరుల సూచనతో నాలిక్కరుచుకుని పొరపాటును సరిచేసుకున్నారు. 
sadananda gouda
BJP
Karnataka

More Telugu News